Bike Accident | ఎదురెదురుగా బైకులు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు..

ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Bike Accident | ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాడ్వాయి మండల (Tadwai Mandal) కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Bike Accident | తాడ్వాయి నుంచి చందాపూర్ వైపు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని హాస్టల్ వద్ద తాడ్వాయి నుంచి చందాపూర్ వైపు వెళ్తున్న బైకు, చందాపూర్ నుంచి తాడ్వాయి వైపు వస్తున్న మరో బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తాడ్వాయికి చెందిన జీవన్, అదే మండలంలోని బ్రహ్మాజీపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స కొనసాగుతోంది. అయితే శ్రావణ్ చందాపూర్ నుంచి తాడ్వాయి వస్తుండగా, జీవన్ తాడ్వాయి నుంచి హాస్టల్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. శ్రావణ్ వ్యవసాయం చేస్తుండగా జీవన్ రెండు రోజుల క్రితమే హాస్టల్ లో వంట పనికి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Birthday | రెంజల్‌లో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *