Student Goals | విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి..

Balla Sandeep Kumar

అక్షరటుడే, బోధన్​: Student Goals | విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా యువజన క్రీడల అధికారి పవన్​కుమార్​ అన్నారు. పట్టణంలోని టీజీఎంఆర్​ఎస్​ (TGMRS) అండ్​ జేసీ గర్ల్స్​–1లో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వెల్ఫేర్ వీక్ కార్యక్రమం భాగంగా ‘స్ల్పాష్​ సమ్మర్​ క్యాంప్’​ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీవైఎస్​వో హాజరై మాట్లాడారు.

Student Goals | లక్ష్యం లేని చదువు.. గందరగోళం

డీవైఎస్​వో మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యం లేకుండా చదివితే గందరగోళానికి గురవుతారన్నారు. ఈ సందర్భంగా టీజీఎంఆర్​ఎస్​ బాల్కొండ విద్యార్థినులు (Balkonda Students) ప్రదర్శించిన పిరమిడ్ ప్రదర్శన అబ్బురపర్చింది. విద్యార్థుల్లో ఉన్న క్రమశిక్షణ, జట్టు ఐకమత్యాన్ని వారు పిరమిడ్​ రూపంలో ప్రదర్శించారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వెల్ఫేర్ వీక్​లో భాగంగా స్టూడెంట్ టాలెంట్ ఫెస్ట్ నిర్వహించారు.

ఇందులో డ్రాయింగ్, క్విజ్, ఉర్దూ, ఇంగ్లిష్​లో వ్యాసరచన పోటీలు నిర్వహించి విన్నర్స్​, రన్నర్స్‌కు బహుమతులు ప్రదానం చేశారు.  కళాశాలలో ఫస్ట్, సెకండ్​ ఇయర్​లో టాపర్లను వారి తల్లిదండ్రులతో కలిసి సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ పద్మజను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సంగీత్ రావు, టీఎంఆర్​ఐఈఎస్​ నిజామాబాద్ రీజినల్ లెవల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీర్, విజిలెన్స్ అధికారి షేక్ అహ్మద్ జియా,ఎండీ హమీద్​ హాజరయ్యారు.

ఇది కూడా చదవండి..: Malaria Awareness | ఎల్లారెడ్డిలో ప్రపంచ మలేరియా డే అవగాహన ర్యాలీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *