Raghav Chadha BJP | రాఘవ్ చద్దా బీజేపీలోకి ఎంట్రీ.. 10 లక్షల మంది ఫాలోవర్లు ఎగ్జిట్!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raghav Chadha BJP | ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కీలక నాయకుడు, ఎంపీ రాఘవ్ చద్దా రాజకీయ నిర్ణయం సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఆప్‌కు గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Raghav Chadha BJP | ఫాలోవర్ల సంఖ్య:

ఆయన పార్టీ మారిన నిర్ణయం వెలువడిన కేవలం 24 గంటల గడవక ముందే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య భారీగా పడిపోయింది.

ముందున్న ఫాలోవర్లు: 14.6 మిలియన్లు

ప్రస్తుత ఫాలోవర్లు: 13.7 మిలియన్లు

నష్టం: దాదాపు 10 లక్షల మంది అన్‌ఫాలో చేశారు.

Raghav Chadha BJP

ప్రజా స్పందన:
ప్రజా సమస్యలపై గళమెత్తే ఒక గొప్ప భవిష్యత్తు నాయకుడిగా రాఘవ్ చద్దాను చూశామని, కానీ ఆయన కూడా మిగతా రాజకీయ నాయకుల్లాగే పార్టీలు మారడం నిరాశకు గురిచేసిందని పలువురు విమర్శిస్తున్నారు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారని భావిస్తే, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: త్రిశూర్ పేలుడు బాధితులకు అండగా కల్యాణ్ జువెలర్స్: ఒక్కో కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సాయం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *