Running Championship | ఇంటర్నేషనల్ రన్నింగ్ ఛాంపియన్‌గా అన్నాసాగర్ యువకుడు మధు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Running Championship | ఎల్లారెడ్డి(Yellareddy)మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన బోరంచ మధు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. నేపాల్‌లో(Nepal) జరిగిన ఇంటర్నేషనల్ రన్నింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్‌గా నిలిచాడు.

Running Championship | క్రీడలపై మక్కువతో..

చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఎంతో మక్కువ చూపే మధు.. ఒకవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే పరుగు పందెంలో రాణిస్తున్నాడు. కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి పేరు తేవడంతో పాటు తమ గ్రామానికి సైతం పేరు ప్రతిష్టలు(Athlete Success) తీసుకురావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామవాసి అంతర్జాతీయ స్థాయిలో గెలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: Govt arrears release | ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *