Stock Market Rally | ప్రతికూలతలు ఉన్నా.. పైపైకి సూచీలు

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Rally | పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరింది. ఎఫ్ ఐఐలు వరుసగా ఏడో సెషన్ లోనూ నికర అమ్మకందారులుగానే ఉన్నారు.

రూపాయి మరోసారి ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా.. కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లకు ఆశాజనకంగా కనిపించాయి. దీంతో వాల్యూ బయ్యింగ్ తో ప్రధాన సూచీలు పరుగులు తీశాయి. ప్రధానంగా బ్లూ చిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

Stock Market Rally | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 359 పాయింట్ల లాభంతో ప్రారంభమై తొలుత 109 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి కోలుకుని 846 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 37 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 275 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 609 పాయింట్ల లాభంతో 77,496 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 24,177 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | మిక్స్ డ్ గా సూచీలు..

నిఫ్టీ (Nifty)లోని ఇండెక్స్ లు మిక్స్ డ్ గా ముగిశాయి. ఎఫ్ ఎంసీజీ ఇండెక్స్ 1.75 శాతం, రియాలిటీ 1.48 శాతం, టెలికాం 1.28 శాతం, ఆటో 1.15 శాతం, ఎనర్జీ 1.14 శాతం, ఐటీ 0.99 శాతం లాభపడగా.. యుటిలిటీ ఇండెక్స్ 1.22 శాతం, పవర్ 1.05 శాతం, మీడియా 0.49 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.43 శాతం నష్టపోయాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,120 కంపెనీలు లాభపడగా 2,112 స్టాక్స్ నష్టపోయాయి. 170 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 165 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 25 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభపడగా.. 8 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఐటీసీ 3.86 శాతం, టెక్ మహీంద్రా 3.14 శాతం, మారుతి 2.82 శాతం, రిలయన్స్ 2.68 శాతం, ఎయిర్ టెల్ 2.30 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇండిగో 2.36 శాతం, ఎన్టీపీసీ 1.33 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.85 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.83 శాతం, ఆసియన్ పెయింట్ 0.62 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Infosys Market Cap | ఇన్ఫోసిస్ కు ఏమయ్యింది?.. టాప్ -10 జాబితానుంచి అవుట్

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *