Sep 24 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

పశ్చిమాసియాలో పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. మన మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 24 Market Analysis | అమెరికా -ఇరాన్(Iran) మధ్య యుద్ధ విరమణకు దౌత్య ప్రక్రియపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఇరాన్‌ను నాశనం చేయగలనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) హెచ్చరించడం, అమెరికా ఒత్తిడికి లొంగబోమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పేర్కొనడంతో చమురు ధరలు తిరిగి వంద డాలర్లు దాటాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

Sep 24 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, ఆల్ఫాబెట్ మరియు అమెజాన్ షేర్ల పతనంతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్ 1.13 శాతం, ఎస్ అండ్ పీ 0.75 శాతం నష్టంతో ముగిశాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.20 శాతం నష్టంతో ఉంది.

Sep 24 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.39 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.66 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.03 శాతం నష్టపోయాయి.

Sep 24 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 1.40 శాతం లాభంతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.46 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.43 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.41 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.15 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.76 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

TGEJAC Talks | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో TGEJAC చర్చలు విఫలం.. డిమాండ్లపై స్పష్టత కరవు.. రేపు అత్యవసర రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం!

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,617 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా 31 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,341 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు బలహీనపడి 95.74 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.18 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.13 శాతం వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 102.23 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.94 నుంచి 1.03 కి పెరిగింది.
  • విక్స్ 5.93 శాతం తగ్గి 10.34 వద్ద ఉంది. ఇది ఈ ఏడాది జనవరి 7 తర్వాత కనిష్టం.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *