Sep 24 Horoscope | ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేని విజయాలు.. ఈ రాశుల వారికి రాజయోగమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 24 Horoscope | గ్రహాలు, నక్షత్రాల అనుకూలత వల్ల ఈ రోజు (గురువారం, సెప్టెంబరు 24) చాలా రాశుల వారికి ఎంతో శుభప్రదంగా, అద్భుతంగా ఉండనుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి శ్రమకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా, ఊహించని ఆర్థిక లాభాలు అందుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడంతో పాటు, జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.

Sep 24 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Sep 24 Horoscope | సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలిసినప్పుడు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇవాళ ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో జరిగే ఒక ముఖ్యమైన పరిణామం మీ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఉద్యోగంలో మీ లక్ష్యాలకు తగినట్లుగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.

వృషభ రాశి: Sep 24 Horoscope | ఆరోగ్యం చాలా బాగుంటుంది, అయితే ఖర్చుల పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిది. లేకపోతే రానున్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆఫీసు లేదా వ్యాపారంలో మీ ఆత్మవిశ్వాసం పెరిగి మంచి అభివృద్ధి కనిపిస్తుంది.

మిథున రాశి: Sep 24 Horoscope | ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది . పిల్లల విజయాలు, సన్మాన వేడుకలు మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రియమైన వారిని కలవడం వల్ల రోజంతా మీ మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో పోటీ పెరిగినప్పటికీ మీ పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: Sep 24 Horoscope | ఇవాళ మీ ఓర్పును ఒక స్నేహితుడు పరీక్షించవచ్చు కాబట్టి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. కొత్తగా డబ్బు సంపాదించే అవకాశాలు మీకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆఫీసులో మీరు చేసిన మంచి పనులకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.

సింహ రాశి: Sep 24 Horoscope | మీ కష్టం, అంకితభావానికి తగిన గుర్తింపు లభించి మంచి ఆర్థిక లాభాలు అందుతాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సమాజంలో కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. ఆఫీసులో సీనియర్లు, సహఉద్యోగుల పూర్తి సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ఒక అద్భుతమైన తీపి వార్త అందుతుంది.

UNSC India Permanent Membership | భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి భారీ మద్దతు! UN వేదికగా మారుతున్న గ్లోబల్ సమీకరణాలు

కన్యా రాశి: Sep 24 Horoscope | భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కోసం జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు. వ్యాపార, ఉద్యోగ సంబంధిత దూర ప్రయాణాలు మెరుగైన ఫలితాలను, లాభాలను ఇస్తాయి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల అనుమతి పొందడం శ్రేయస్కరం.

తులా రాశి: Sep 24 Horoscope | సమయాన్ని వృథా చేయకుండా ఆదాయాన్ని ఇచ్చే కొత్త పనిపై దృష్టి పెట్టండి. ఇతరులతో మరీ ఉదారంగా ఉంటే మిమ్మల్ని అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. ఆఫీసులో ముఖ్యమైన ఫైళ్లను పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే పై అధికారులకు అందజేయండి. భాగస్వామి తరఫు బంధువుల వల్ల చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు కాబట్టి శాంతంగా ఉండండి.

వృశ్చిక రాశి: Sep 24 Horoscope | అనవసర గొడవలు, వాదనల వల్ల మూడ్ పాడవుతుంది . ఆఫీసులో అవకాశాల కోసం ఎదురుచూడకుండా మీరే కొత్త మార్గాలను అన్వేషించడం మంచిది. ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

ధనుస్సు రాశి: మీలోని ఆశావాద దృక్పథం మిమ్మల్ని ప్రతికూల ఆలోచనల నుండి కాపాడుతుంది. ఇవాళ మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది, పాత బాకీలు వసూలవుతాయి. తోబుట్టువుల సమస్యల్లో మీ సలహా వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు ఇది అనుకూలమైన రోజు. ఆఫీసులో మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.

మకర రాశి: పరిచయస్తులు ఆర్థిక సహాయం కోరితే వారి సామర్థ్యాన్ని చూసి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులు చిన్న విషయాలను పెద్దవిగా చేసినా మీరు సహనంతో వ్యవహరించండి. ఆఫీసులో మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఖాళీ సమయంలో కొన్ని సృజనాత్మక (క్రియేటివ్) పనులను ఉత్సాహంగా ప్రారంభిస్తారు.

కుంభ రాశి: ఒక కార్యక్రమంలో కలిసే వ్యక్తి సలహా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ సోదరుడు పూర్తి మద్దతుగా నిలుస్తారు. వైవాహిక జీవితంలో పాత మనస్పర్థలన్నీ తొలగిపోతాయి .

మీన రాశి: ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసేవారు తమ డబ్బును దొంగతనం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆఫీసులో శ్రమకు తగిన ఫలితం లభించి ప్రమోషన్ లేదా ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. మీ .జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక అద్భుతమైన బహుమతి లేదా తీపి వార్తతో సర్ ప్రైజ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడానికి సూర్యోదయ సమయంలో ‘ఓం గృణి సూర్యాయ నమః’ జపించండి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *