Kamareddy Bike Accident | రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

ఎదురుగా వస్తున్న బైక్​ మరో బైక్​ను ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Bike Accident | ఎదురుగా వస్తున్న బైక్​ మరో బైక్​ను ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటన రామారెడ్డి(Ramareddy Police) మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Kamareddy Bike Accident | రామారెడ్డి మండలం మద్దికుంట..

స్థానికులు, పోలీసుల (Kamareddy ) కథనం ప్రకారం.. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన భార్యాభర్తలు దుంపల బాలమణి(38), దుంపల రాజయ్య(45) కామారెడ్డి నుంచి మద్దికుంటకు వెళ్తున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ సమీపంలో రామారెడ్డికి చెందిన రాఘవేంద్ర, నరేందర్ ఇద్దరు ఓ బైకుపై వేగంగా కామారెడ్డి వైపు వస్తున్నారు. మద్దికుంటకు చెందిన భార్యాభర్తలు వస్తున్న బైక్​ను బలంగా ఢీకొనడంతో ఇరువురు కింద పడిపోయారు. బాలమణి, రాజయ్యలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు కామారెడ్డి జీజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భార్యాభర్తలు మృతి చెందారు. రామారెడ్డికి చెందిన ఇద్దరు యువకులకు సైతం గాయాలు కావడంతో జీజీహెచ్​లో చికిత్స కొనసాగుతోంది. మృతిచెందిన భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *