Tank Bund Hit And Run | ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ దుర్మరణం!

ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని బైక్‌, దాని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tank Bund Hit And Run | ట్యాంక్‌ బండ్‌ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. గణేష్‌ నిమజ్జనం విధుల్లో ఉన్న పోలీస్‌ ఎస్‌ఐని గుర్తుతెలియని బైక్‌ ఢీకొట్టి పరారైంది. తీవ్ర గాయాలపాలైన ఎస్‌ఐ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ట్యాంక్‌ బండ్‌ క్రేన్‌-2 వద్ద గణేష్‌ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్‌ ఎస్‌ఐ కె. వెంకన్న (55)ను గుర్తుతెలియని బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బైక్‌ ఆపకుండా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Tank Bund Hit And Run | పోలీసుల దర్యాప్తు..

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను వెంటనే ఎంజీఎం MGM ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

TGEJAC Talks | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో TGEJAC చర్చలు విఫలం.. డిమాండ్లపై స్పష్టత కరవు.. రేపు అత్యవసర రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం!

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని బైక్‌, దాని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
1 Comment
  • అంత పెద్ద సిటీలో వినాయక నిమర్జనం లో ఎక్కడి కక్కడ సీసీ పుటేజిలు ఉంటవి గధ కంపల్సరీ దొరుకుతాడు
    వినాయక నిమర్జనం లో వెంక్కన్న మరణం
    చాలా బాధాకరం💐💐 ఓం శాంతి 💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *