నిజామాబాద్Youth Congress Leaders | యువజన కాంగ్రెస్ నుంచి గొప్ప నాయకులు ఎదిగారు : ప్రభుత్వ...

Youth Congress Leaders | యువజన కాంగ్రెస్ నుంచి గొప్ప నాయకులు ఎదిగారు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

దేశంలో ఎంతోమంది యువజన కాంగ్రెస్ నుంచే గొప్ప నాయకులుగా ఎదిగారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Leaders | దేశంలో ఎంతోమంది యువజన కాంగ్రెస్ నుంచే గొప్ప నాయకులుగా ఎదిగారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (shabbir ali) అన్నారు. సోమవారం భిక్కనూరు(Bhikkanoor) మండల కేంద్రంలోని ఎస్​వీ గార్డెన్‌లో భిక్కనూరు మండల యువజన కాంగ్రెస్(Youth Congress) కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొని నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.

Youth Congress Leaders | రాజకీయ విభాగం మాత్రమే కాదు..

ఆయన మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ అనేది కేవలం ఒక రాజకీయ విభాగం మాత్రమే కాదని, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసే పాఠశాల అని పేర్కొన్నారు. తాను యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని తెలిపారు. అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లిన ఉద్యమంలో పాల్గొన్నందుకు నెలరోజుల పాటు జైలుశిక్ష అనుభవించానని, కానీ ప్రజల కోసం చేసిన ఆ పోరాటమే తన రాజకీయ జీవితానికి బలమైందని చెప్పారు. కేవలం 30ఏళ్ల వయసులోనే మంత్రి అయ్యానంటే దానికి కారణం యువజన కాంగ్రెస్‌లో చేసిన పోరాటాలేనని పేర్కొన్నారు.

Youth Congress Leaders | సీఎం రేవంత్​రెడ్డి సైతం..

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా యువజన కాంగ్రెస్ నాయకుల పోరాటాలను గుర్తు చేసుకుంటున్నారని, పోరాట స్ఫూర్తి ఉన్న వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత ఎప్పుడూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రతిపక్షాల అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. యువత ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపు ఇస్తుందని, భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తుందని తెలిపారు.

Share post:

Popular

More like this
Related

Sand Transport Rules | ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sand Transport Rules | ఇసుక రవాణా...

Ex Mla Jajala | బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల

అక్షరటుడే, గాంధారి: Ex Mla Jajala | కేంద్ర మంత్రి పదవి...

Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Work From Home | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న...

TRS Flag Festival | మే 20 నుంచి టీఆర్​ఎస్​ జెండా పండుగలు : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRS Flag Festival | తెలంగాణ (Telangana)...