TRS Flag Festival | మే 20 నుంచి టీఆర్​ఎస్​ జెండా పండుగలు : కవిత

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRS Flag Festival | తెలంగాణ (Telangana) రక్షణ సేన భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు నెల రోజుల పాటు వాడవాడనా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు.

కవిత ఇటీవల టీఆర్​ఎస్​ పార్టీ (TRS Party)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ బలోపేతంపై ఆమె దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు.

TRS Flag Festival | ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు

తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కవిత కోరారు. అలాగే పార్టీ ఆవిర్భావ సభలో తెలిపిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపైన పోరాడాలన్నారు. జెండా పండుగలో భాగంగా కార్యకర్తలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Bandi Bhagirath POCSO Case | బండి భగీరథ్​ కేసులో విచారణ ప్రారంభం : సీఎం రేవంత్​రెడ్డి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *