Gandhi hospital | ‘గాంధీ’ ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్​గా నాగమోహన్ బాధ్యతల స్వీకరణ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gandhi hospital | నిజామాబాద్​ జీజీహెచ్ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా పనిచేసిన బీవీ నాగమోహన్​రావు గాంధీకి ఆస్పత్రికి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన బుధవారం సికింద్రాబాద్​లోని గాంధీ మెడికల్​ కాలేజీలో ఫోరెన్సిక్​ మెడిసిన్​ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుకు ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. డాక్టర్​ నాగమోహన్ రావు 2016 నుంచి నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా సేవలందిస్తూ విభాగ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.

Gandhi hospital | నిజామాబాద్​ జీజీహెచ్​లో కీలక బాధ్యతలు

నిజామాబాద్​ నగరంలోని మెడికల్​ కళాశాలలో నాగమోహన్ ఫోరెన్సిక్​​ డిపార్ట్​మెంట్​ ప్రొఫెసర్​గా విధులు నిర్వహించారు. కాగా.. కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఆయనకు జీజీహెచ్ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు ప్రణాళికతో పనిచేశారు. కాగా.. ఆయనను గాంధీ మెడికల్​ కళాశాల ఫోరెన్సిక్​ మెడిసిన్​ ప్రొఫెసర్​గా బదిలీ చేస్తూ డీఎంఈ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: Medical College Transfers | మెడికల్ కళాశాలలో భారీగా బదిలీలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *