Kamareddy RTC Driver | కామారెడ్డిలో విషాదం.. ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణం

ఉద్యోగం కోల్పోయిన మనస్తాపంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy RTC Driver | ఉద్యోగం కోల్పోయిన మనస్తాపంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

Kamareddy RTC Driver | వివరాల్లోకి వెళ్తే..

కామారెడ్డి (Kamareddy) డిపోలో రెగ్యులర్ డ్రైవర్ గా పనిచేస్తున్న పర్షం సాయన్న (48) నాలుగు నెలల క్రితం డిపోలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. పరీక్షలో 33 శాతం నమోదు కావడంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేసి, అనంతరం సర్వీసు నుంచి తొలగించారు. అప్పటినుంచి తిరిగి ఉద్యోగం పొందేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. న్యాయపరమైన చిక్కులతో తిరిగి ఉద్యోగం రావడానికి 4-5 ఏళ్లు పడుతుందని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడికి ఇటీవలే ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది. సాయన్న మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: RI Death Incident | గన్​ మిస్​ఫైర్​.. ఆర్​ఐ మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *