అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flipkart Freedom Sale | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లతో మరో సేల్కు సిద్ధమైంది. ఏటా నిర్వహించినట్లుగానే ‘ఫ్రీడమ్ సేల్ ’తో కస్టమర్ల ముందుకొస్తోంది. ఆగస్టు 8 నుంచి సాధారణ కస్టమర్లందరికీ సేల్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్, వీఐపీ మెంబర్లకు మాత్రం ఒకరోజు ముందుగానే.. అంటే ఆగస్టు 7 నుంచే అందుబాటులో ఉండనుంది. కొత్త స్మార్ట్ఫోన్లు, బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సేల్ మంచి అవకాశం.
Flipkart Freedom Sale | ఎస్బీఐ కార్డుతో 10 శాతం వరకు డిస్కౌంట్..
ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ సేల్ కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో జత కట్టింది. ఇందులో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈఎమ్ఐతోపాటు నాన్ ఈఎమ్ఐ లావాదేవీలకూ ఇది వర్తించనుంది. పాత ఫోన్లు, పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మార్చుకోవాలనుకునే వారికి అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇవ్వనున్నారు.
Flipkart Freedom Sale | డీల్స్ ఆఫ్ ది డే, రష్ అవర్ ఆఫర్స్..
కస్టమర్లలో ఆసక్తి, ఉత్కంఠ రేపేందుకు ఫ్లిప్ కార్ట్ రకరకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. రోజువారీగా ‘డీల్స్ ఆఫ్ ది డే’, కొద్ది సమయం అందుబాటులో ఉండే ‘రష్ అవర్స్’, ‘టిక్ టాక్ డీల్స్’తో అదనపు ప్రయోజనాలు అందించనుంది. ఆఫర్ల పూర్తి వివరాలు, కచ్చితమైన ధరలు త్వరలో రివీల్ కానున్నాయి.
ఇది కూడా చదవండి..: Aug 06 Gold Prices | హైదరాబాద్‌లో బంగారం ధరలు జంప్..అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్‌కు భారీ ఊపు