Govt arrears release | ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt arrears release | రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు (Govt Employees) గుడ్​న్యూస్​ చెప్పింది. రూ.వెయ్యి కోట్లు బకాయిలు విడుదల చేసింది. అక్టోబర్‌ 2025 వరకు రిటైర్డ్‌ ఉద్యోగుల GPF క్లియర్‌ చేసింది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా విడుదల చేసింది. గతంల నెలకు రూ. 700కోట్లు చెల్లించగా.. తాజాగా ఆ మొత్తాన్ని రూ. వెయ్యి కోట్లకు పెంచారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల GPF బకాయిలు అక్టోబర్ 2025 వరకు పూర్తిగా చెల్లించారు. ఉద్యోగుల వైద్య బిల్లులను జాప్యం లేకుండా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Govt arrears release | హామీ మేరకు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతేడాది ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో బకాయిల కోసం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు 2025 జూన్​ నుంచి నిధులు విడుదల అవుతున్నాయి. మార్చి 2026 వరకు సంబంధించిన నెలవారీ చెల్లింపులను ప్రభుత్వం పూర్తి చేసింది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ.వెయ్యి కోట్లకు పెంచాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వైద్య బిల్లులతో పాటు, స్కాలర్‌షిప్ చెల్లింపులను కూడా పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి : TS SSC Results | పదో తరగతి ఫలితాలు విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *