AI Toll System | టోల్ గేట్ల దగ్గర ఆగకుండానే టోల్ కట్.. కేంద్రం సరికొత్త ‘ఏఐ’ ప్లాన్!

Balla Sandeep Kumar

అక్షరటుడే, న్యూఢిల్లీ: AI Toll System | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) తీపి కబురు అందించింది. టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా, వాహనాలు ఆగకుండానే టోల్ వసూలు చేసే సరికొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకురానుంది. డిసెంబర్ 2026 నాటికి దేశవ్యాప్తంగా పలు కీలక రహదారులపై ఈ ‘బారియర్-లెస్’ (Barrier-less) టోలింగ్ విధానం అందుబాటులోకి వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) ప్రకటించారు.

AI Toll System | ఏఐ అనలిటిక్స్‌:

ఈ కొత్త విధానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు, ఏఐ అనలిటిక్స్‌ను ఉపయోగించనున్నారు. వాహనం టోల్ పాయింట్ వద్ద వేగాన్ని తగ్గించకుండానే (గంటకు 80 కి.మీ వేగంతో వెళ్తున్నా), అక్కడ అమర్చిన హై-పెర్ఫార్మెన్స్ రీడర్లు ‘ఫాస్టాగ్’ (FASTag)ను, నంబర్ ప్లేట్‌ను ఒకేసారి గుర్తిస్తాయి. వెహికల్ కదులుతుండగానే ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీలు కట్ అవుతాయి.

AI Toll System | కేంద్రం కఠిన నిబంధనలు:

ఒకవేళ మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా, సాంకేతిక కారణాల వల్ల అది పనిచేయకపోయినా కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. అన్-పెయిడ్ టోల్ వివరాలతో కూడిన ఈ-నోటీసులు నేరుగా వాహన యజమాని మొబైల్‌కు (SMS/Email) వస్తాయి. నోటీసు వచ్చిన 72 గంటల్లోపు టోల్ చెల్లిస్తే పెనాల్టీ ఉండదు. గడువు దాటితే టోల్ ధరకు రెట్టింపు జరిమానా విధిస్తారు.

AI Toll System | వాహన్ పోర్టల్‌తో అనుసంధానం:

ఈ టోల్ వ్యవస్థను నేరుగా కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ (VAHAN) పోర్టల్‌తో అనుసంధానం చేశారు. బకాయిలు చెల్లించని వాహనాల వివరాలు వాహన్ డేటాబేస్‌లో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో ఆ వాహనానికి సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లేదా ఇతర సేవలు పొందేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Raghav Chadha BJP | రాఘవ్ చద్దా బీజేపీలోకి ఎంట్రీ.. 10 లక్షల మంది ఫాలోవర్లు ఎగ్జిట్!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *