అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balka Suman Comments | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఆఫీస్ (Singareni Office)ను తగులబెట్టండని రెచ్చగొట్టెలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.
సింగరేణి ప్రాంతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) పూర్వ వైభవం తీసుకురావడానికి సాధారణ నిరసనలు సరిపోవని బాల్క సుమన్ అన్నారు. ఉధృతమైన నిరసనలకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మందమర్రి ఏరియాలోని జీఎం ఆఫీసు వద్ద, హైదరాబాద్ (Hyderabad)లోని సింగరేణి భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేయాలని సూచించారు. అవసరమైతే రైల్ రోకోల వంటి తీవ్రమైన ఆందోళనలు చేపట్టాలన్నారు.
Balka Suman Comments | కేసులకు భయపడొద్దు
కేసులకు భయపడకుండా పోరాటాలు చేయాలని బాల్క సుమన్ అన్నారు. నెల రోజులు జైలుకు వెళ్లడానికి అయిన సిద్ధంగా ఉండాలని సూచించారు. రైలు రోకో నిర్వహించి రైల్వే లైన్లను కోసి పారేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలన్నారు. అప్పుడే ప్రజలు వస్తారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తే రైతులు రావడం లేదన్నారు. మందమర్రిలో ఆందోళన చేపట్టి జీఎం ఆఫీస్ కాలబెట్టాలన్నారు.
Balka Suman Comments | చర్యలు ఉంటాయా..
ఓ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బహిరంగంగా కార్యకర్తలకు పిలుపునివ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. మరీ బాల్క సుమన్‌పై ఎలాంటి చర్యలు చేపడుతారో చూడాలి. ఆయనపై సుమోటాగా కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Vijaya Reddy Funeral | మాజీ మంత్రి సతీమణి పార్థీవదేహానికి పీసీసీ చీఫ్ ఘననివాళి


