అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Gains | జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తూ గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. వాల్యూ బయ్యింగ్ చేస్తుండంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం ప్రారంభ నష్టాలను పూడ్చుకుని లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Stock Market Gains | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 142 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 394 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో ప్రారంభమె మరో 12 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 108 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 76,123 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 23,959 వద్ద ఉన్నాయి.
Stock Market Gains | పవర్, మెటల్ స్టాక్స్‌లో దూకుడు..
నిఫ్టీ (Nifty)లో పవర్ ఇండెక్స్ 2.43 శాతం, యుటిలిటీ 2.41 శాతం, మెటల్ 1.90 శాతం, మీడియా 1.81 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.59 శాతం, రియాలిటీ 1.25 శాతం, టెలికాం 0.95 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.87 శాతం, ఆటో 0.85 శాతం శాతం లాభాలతో ఉండగా.. ఎనర్జీ 0.43 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.35 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.21 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో, 7 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టాటాస్టీల్ 2.54 శాతం, పవర్‌గ్రిడ్ 2.07 శాతం, ఎన్టీపీసీ 1.76 శాతం, ఎటర్నల్ 1.42 శాతం, ఆసియన్ పెయింట్ 1.29 లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ 1.90 శాతం, హెచ్యూఎల్ 0.60 శాతం, ఇన్ఫోసిస్ 0.34 శాతం, సన్‌ఫార్మా 0.30 శాతం, బీఈఎల్ 0.15 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: May 27 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ క్యూస్.. స్వల్ప నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్


