అక్షరటుడే, ఇందూరు/ఆర్మూర్: Vijaya Reddy Funeral | మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి సతీమణి విజయరెడ్డి రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో (Hyderabad) మృతి చెందారు. బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
Vijaya Reddy Funeral | నివాళులర్పించిన పీసీసీ చీఫ్..
ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) బుధవారం మహాప్రస్థానానికి వెళ్లారు. మాజీ మంత్రి సంతోష్‌రెడ్డిని (Former Minister Santosh Reddy) పరామర్శించారు. అనంతరం ఆయన సతీమణి విజయరెడ్డి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Panipuri Food Poisoning | పానీపూరి తిని 25 మందికి తీవ్ర అస్వస్థత


