తెలంగాణPanipuri Food Poisoning | పానీపూరి తిని 25 మందికి తీవ్ర అస్వస్థత

Panipuri Food Poisoning | పానీపూరి తిని 25 మందికి తీవ్ర అస్వస్థత

పానీపూరి తిని 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Panipuri Food Poisoning | పానీపూరి.. చాలా మంది ఇష్టంగా తినే చాట్. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా తింటారు. విద్యార్థులు సైతం గప్​చుప్​లను ఇష్టంగా లాగిస్తారు. అయితే చాలా మంది పానీపూరి సెంటర్ల వారు పరిశుభ్రత పాటించారు. దీంతో దానిని తిన్న వారు అనారోగ్యం బారీన పడుతారు.

గద్వాల జిల్లా (Gadwal District) అయిజ మున్సిపాలిటీలో పానీపూరి తిని 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కొంతమంది అమ్మాయిలు రాత్రి 7:30 గంటలకు పాని పూరి తినేందుకు వెళ్లారు. అది తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రులకు తరలించారు.

Panipuri Food Poisoning | పోలీసుల దర్యాప్తు

Panipuri Food Poisoning

బాధితులు ప్రస్తుతం పట్టణంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పాత బస్టాండ్​ కూడలి వద్ద ఉన్న ఓ పానీపూరి బండి దగ్గర పానీపూరీ తిన్నట్లు బాలికలు తెలిపారు. దీంతో బాధిత యువతుల కుటుంబ సభ్యులు పానీపూరి బండి దగ్గర ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానాకి చేరుకున్నారు. బండిని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై మల్లేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. రైతులకు తీవ్ర నష్టం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...

Telangana Urban Housing | పేదల సొంతింటి కల నిజం చేస్తూ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. CURE పరిధిలో లక్ష గృహాల నిర్మాణానికి ఆమోదం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Urban Housing | తెలంగాణ రాష్ట్రంలోని అల్పాదాయ...

Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు..! నగరంలో కలకలం రేపిన ఘటన..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు...