అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Peddi Sudarshan Reddy | నర్సంపేట (Narsampeta) మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి నుంచి గ్రీన్ చానెల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి (Yashoda Hospital)కి తరలిస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.
Peddi Sudarshan Reddy | యశోద ఆస్పత్రికి..
సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. దీని కోసం పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ వెంట సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్, హరీశ్‌రావు బయలుద దేరారు.
గ్రీన్ చానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు
అంబులెన్స్ వెంట హైదరాబాద్ బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు https://t.co/kHR4YLOe0h pic.twitter.com/wsQjF8PP24
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2026
దీనిని కూడా చదవండి : Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత