ACB Bribe Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్​

హుజురాబాద్ సబ్-జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ లంచం తీసుకుంటూ​ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Bribe Case | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. అన్ని శాఖల్లో లంచాలు తీసుకునే అధికారులు తిష్ట వేశారు. ప్రతి పనికి ఓ రేటు కట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. చివరకు జైలులో ఖైదీలతో ములాఖత్​ల కోసం లంచం డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కరీంనగర్ (Karimnagar)​ జిల్లా హుజురాబాద్ సబ్-జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్​ ఏసీబీ (ACB) అధికారులకు చిక్కాడు. ఆయనతో పాటు పెట్రోల్ బంక్ నిర్వాహకుడు రావుల హరీష్‌ రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఖైదీలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, ములాఖత్‌లకు (ఖైదీల భేటీకి) అనుమతించడం, ఒక ఖైదీని ఖమ్మం జైలుకు తరలించకుండా ఆపడం కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ACB Bribe Case | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. రూ.వంద లంచం అడిగిన తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ 1064కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Assembly Sessions | వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *