అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Rains Alert | హైదరాబాద్ మహా నగరంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రాత్రి 9:50 గంటల నుంచి 11 గంటల మధ్య పశ్చిమ, మధ్య, దక్షిణ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Hyderabad Rains Alert | ఈ ప్రాంతాల్లో అలెర్ట్..
రాజేంద్రనగర్, మణికొండ, షేక్‌పేట్, టోలిచౌకి, గోల్కొండ, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, ఫలక్‌నుమా, చార్మినార్, బహదూర్‌పురా, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉండొచ్చని అంచనా.
Dancer Raju Arrest | సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ‘ఢీ’ డ్యాన్సర్ రాజు అరెస్టు
దీంతోపాటు సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, బోయిన్‌పల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Hyderabad Rains Alert | ఉత్తర, తూర్పు హైదరాబాద్‌కూ వర్షాలు
తొలుత పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురిసిన అనంతరం.. నగరంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల వైపునకు కూడా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా. వాతావరణ పరిస్థితులపై మరిన్ని అప్డేట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రాత్రి వేళ ప్రయాణాలు చేసే వారు వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్ష తీవ్రతను బట్టి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పేర్కొంటున్నారు.