అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR HILT Policy | బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీ రద్దు చేస్తామన్నారు.
కేటీఆర్ శనివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీ పేరుతో 10 వేల ఎకరాల విలువైన భూములను ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఈ పాలసీని రద్దు చేస్తామన్నారు. ఈ పాలసీ కింద ఎవరైనా డబ్బులు చెల్లిస్తే నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
KTR HILT Policy | నీటి కోసం మరో ఉద్యమం
జీఆర్‌ఎంబీ (GRMB) సమావేశం ఎజెండాను ఒప్పుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులకు మించిన మరో ప్రాధాన్యత తమ పార్టీకి లేదన్నారు. నదీ జలాల్లో కేంద్రమైనా, రాష్ట్రమైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని నీటి వాటాల్లో అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్‌ని సలహాదారుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు.
KTR HILT Policy | సీఎంకు సోయిలేదు
నదుల నుంచి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తిపోసుకుంటే… ముఖ్యమంత్రికి కనీసం సోయి లేదని కేటీఆర్ విమర్శించారు. యాగాలు చేస్తే తప్పు లేదన్నారు. కానీ యాగాలతో పాటు ముఖ్యమంత్రికి తన బాధ్యతలు నిర్వహించాలని హితవు పలికారు. పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, నీళ్లు ఎప్పుడు ఎత్తిపోయాలనే కనీస అవగాహన ఆయనకు లేదని విమర్శించారు. క్షుద్రపూజలు అని చెప్పి కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు చేస్తుందన్నారు.
దీనిని కూడా చదవండి : Rent Boyfriend Scam | రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్!.. ఒంటరి యువతులే లక్ష్యం