అక్షరటుడే, వెబ్డెస్క్ : Irrigation Projects | భూసేకరణ, పునరావాసం (R&R) కోసం రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.2వేల విడుదల చేశారన్నారు. మిగిలిన రూ. 3,000 కోట్ల నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులపై శనివారం మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ శాఖ అనుమతులు, పర్యావరణ అనుమతులను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా పరిగణించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన నిధుల వివరాలను సమర్పించి, ఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత టోకెన్లను పొందాలని కలెక్టర్లను ఆయన కోరారు. సాధ్యమైన చోట ఇంజనీరింగ్ పనులతో పాటు భూ యజమానులకు పరిహారం చెల్లింపు, ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన కుటుంబాల పునరావాస ప్రక్రియను కూడా సమాంతరంగా కొనసాగించాలని ఆయన సూచించారు.
Irrigation Projects | నిలిచిపోయిన పనులపై..
సుమారు నాలుగన్నర ఏళ్లుగా పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. మిడ్ మానేరు ఎడమ కాలువకు సంబంధించిన భూ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించి, మిగిలిన పనులను పునఃప్రారంభించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం, పత్తిపాక వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జలాశయం పనులను వేగవంతం చేయాలని అన్నారు. కాకతీయ ప్రధాన కాలువలోని డి-83 నుండి డి-94 పరిధిలో 2.40 లక్షల ఎకరాలను స్థిరీకరించి, 10,000 ఎకరాల కొత్త సాగునీటి సామర్థ్యాన్ని సృష్టించడానికి ఈ పథకాన్ని ప్రతిపాదించారు.
దీనిని కూడా చదవండి : IAF Officer Honeytrap | ఐఏఎఫ్ అధికారి హనీట్రాప్.. పాక్కు రహస్యాల చేరవేత