Gold Man Surya Bhai | ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్​గా పేరొందిన సూర్యాభాయ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Man Surya Bhai | ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్​గా పేరొందిన సూర్యాభాయ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి అత్యంత సన్నిహితుడిని అని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ప్రాణ స్నేహితుడిని అని చెప్పుకొని సూర్యాభాయ్ పలువురి వద్ద రూ.లక్షలు వసూలు చేశాడు.

సూర్యాభాయ్ అసలు పేరు పల్లపు సురేష్ కుమార్. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. తక్కువ ధరకు స్వచ్చమైన బంగారం ఇప్పిస్తానని పలువురి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. డబ్బులిచ్చి నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వలేదని ప్రశ్నించిన వారిని బెదిరించాడు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అత్తాపూర్​ పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్​ చేశారు.

Gold Man Surya Bhai | రోల్డ్​ గోల్డ్​తో..

సూర్యాభాయ్ ధరించే భారీ ఆభరణాలు నిజమైనవి కావని, అవన్నీ రోల్డ్ గోల్డ్ (నకిలీ) అని ఐటీ అధికారులు గతంలోనే తేల్చారు. ఈ మోసాల ఆరోపణలతో పాటు, మరో తప్పుడు ఫిర్యాదు కేసులోనూ ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు అత్తాపూర్ పోలీసులు వెల్లడించారు. తక్కువ ధరకు బంగారం అంటే నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. లైసెన్స్​ ఉన్న బంగారు దుకాణాల్లో మాత్రమే బంగారం, ఆభరణాలు కొనుగోలు చేయాలన్నారు.

ఇది కూడా చదవండి..: తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *