అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar Flood | నాగర్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
ఎగువన కర్ణాటకతో పాటు స్థానికంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వరద తగ్గింది. ప్రస్తుతం జలాశయంలోకి 20,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఏపీ విద్యుత్ కేంద్రం ద్వారా 7,902 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ కేంద్రం ద్వారా 39,631 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలు, కాలువకు నీటి వదులుతున్నారు. దీంతో మొత్తం 63,461 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదు అవుతోంది. ఇన్‌ఫ్లో కంటే అవుట్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం తగ్గుతోంది. గురువారం జలాశయంలో 185 టీఎంసీల నీరు నిల్వ ఉండా.. శుక్రవారానికి 181 టీఎంసీలకు తగ్గింది.
Nagarjuna Sagar Flood | సాగర్‌కు జలకళ
శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో నాగర్జున సాగర్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. అయితే ప్రాజెక్టు నిండటానికి ఇంకా చాలా నీరు అవసరం. ప్రస్తుతం వరద కొనసాగుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడితే సాగర్ నిండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Telangana Weather | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన