అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Weather | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం, రాత్రి వేళలో వాన పడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ (Telangana)లోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిర్మల్, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.
Telangana Weather | రేపు భారీ వర్షాలు
మధ్యప్రదేశ్ సమీపంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో శనివారం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గత నాలుగైదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే రేపు భారీ వానలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం నుంచి మళ్లీ వర్షాలు తగ్గుముఖం పడుతాయన్నారు.
ఇది కూడా చదవండి: Suryapet Bus Stand | “పురుషులను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం”..సూర్యాపేట బస్టాండులో వెలిసిన వింత బోర్డు!