NIMS Doctor Assets | నిమ్స్​ డాక్టర్​ లక్ష్మీ భాస్కర్​.. బినామీల పేరిట భారీగా ఆస్తులు

నిమ్స్​ డాక్టర్​ లక్ష్మీ భాస్కర్​ బినామీల ఇళ్లలో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NIMS Doctor Assets | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని నిమ్స్​ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్‌ నివాసాల్లో ఇటీవల ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. భారీగా అక్రమాస్తులు గుర్తించి, ఆయనపై కేసు నమోదు చేశారు. అంతేగాకుండా రిమాండ్​కు కూడా తరలించారు.

లక్ష్మీ భాస్కర్​ బినామీల పేరిట భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిమ్స్​లో పని చేసే ఉద్యోగులను తన బినామీలుగా మార్చుకొని వారి పేరిట ఆస్తులు కొనుగోలు చేశాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం ఆయన బినామీల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 5 చోట్ల తనిఖీలు చేసి, భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

NIMS Doctor Assets | రూ.2.70 కోట్ల ప్లాటు

నిమ్స్​ ఉద్యోగి ధనరాజ్ ఇంట్లో ఏసీబీ అధికారులు రూ.4.94 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి డి. గణేష్, ఇతరుల పేర్ల మీద మహేశ్వరంలోని సుమారు 57 లక్షల విలువైన 3 వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో గల వెంకటేశ్వర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏకంగా రూ.2.70 కోట్ల విలువైన ఓపెన్​ ప్లాట్​ ఉంది. రూ. 20 లక్షల విలువైన రెండు పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, రూ. 3 లక్షల అప్పు రసీదులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిని కూడా చదవండి : India Gold Medal | భారత్​ ఖాతాలో మరో గోల్డ్​ మెడల్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *