Konda Surekha Action | కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి.. మండలి ఛైర్మన్​ కీలక వ్యాఖ్యలు

శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మార్పు కనిపించాలన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Surekha Action | శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మార్పు కనిపించాలన్నారు. శనివారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

కొండా సురేఖ అంశంలో చర్యలు తీసుకుంటేనే బెటర్ అని సుఖేందర్​ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. ఆ కుటుంబంపై చర్యలు తీసుకోవడానికి రెండు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆమెపై వేటు వేయడం, మంత్రి శాఖలను పునర్వ్యవస్థీకరణ రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తుందని, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. లంబాడా, యాదవ్, మున్నూరుకాపులకు మంత్రి పదవుల్లో అవకాశం ఇవ్వాలని సూచించారు. అప్పుడే అసంతృప్తి నేతలకు చెక్ పెట్టినట్టు ఉంటుందన్నారు.

Konda Surekha Action | చేయాల్సింది చాలా ఉంది

ప్రజలకు చేయాల్సింది ఇంకా చాలా ఉందని మండలి ఛైర్మన్​ అభిప్రాయ పడ్డారు. ఉచిత పథకాలు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. పెన్షన్​ పెంచాలని, ఉద్యమకారులకు న్యాయం చేయాలని సూచించారు. కాంగ్రెస్​ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలన్నారు. చిన్నారెడ్డికి మంచి అవకాశం ఇచ్చిందని, ఆయన అలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ద్వారాలు ఉన్నాయని, ఎవరు ఏ విండోలో ఉంటారో తెలియదన్నారు.

Konda Surekha Action | సీఎంపై అసంతృప్తి

సీఎం రేవంత్​రెడ్డిపై క్యాడర్​ అసంతృప్తి ఉందని సుఖేందర్​ రెడ్డి అన్నారు. సాధారణ ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారన్నారు. ఆయనను పని చేసుకోనివ్వాలన్నారు. 22ఏ ను రద్దు చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Tree Dispute | వేప చెట్టు కోసం గొడవ.. ఇద్దరి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *