అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Manhole Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి ఓ వృద్దుడు గల్లంతు అయ్యాడు.
నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. ఈ క్రమంలో మియాపూర్‌లో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ ఓ వృద్ధుడు గల్లంతు అయ్యాడు. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హఫీజ్‌పేట్‌లోని ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్య (70) మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది బాలయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Manhole Accident | అధికారుల నిర్లక్ష్యంతో..
అక్కడ జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ఆ మ్యాన్‌హోల్ తెరిచి ఉంచినట్లు సమాచారం. ఆ ప్రదేశంలో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని బాలయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Car Fire | నడుస్తున్న కారులో మంటలు.. తప్పిన ప్రమాదం