Bodhan Sand Mining | బోధన్‌లో జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bodhan Sand Mining | బోధన్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కన్నుగప్పి ఇసుక మాఫియా జోరుగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని వారు అంటున్నారు.

Bodhan Sand Mining | భారీ యంత్రాలతో..

బోధన్ పట్టణానికి సమీపంలోని పసుపు వాగులో శుక్రవారం రాత్రి భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు సమాచారం. పొక్లెయిన్​ యంత్రాలతో ఇసుకను తవ్వి, టిప్పర్ల ద్వారా తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఒక పొక్లెయిన్​తో పాటు నాలుగు టిప్పర్లు రాత్రి సమయంలో ఇసుక రవాణాలో పాల్గొన్నట్లు వారు పేర్కొన్నారు.

Illegal Sand Transport |

Bodhan Sand Mining | పసుపు వాగులో నిరంతరాయంగా..

ఇసుక అక్రమ రవాణాపై ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు అక్రమ వ్యాపారులు వాటిని పట్టించుకోకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసుపు వాగులో నిరంతరంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Green Cave Chhattisgarh | భూగర్భంలో ప్రకృతి మాయాజాలం.. బస్తర్ అడవుల్లో వెలుగుచూసిన అరుదైన ‘గ్రీన్ కేవ్’!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *