Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్​క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా మేనేజ్‌మెంట్ కమిటీ శుక్రవారం కొలువుదీరింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Red Cross | ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్‌మెంట్ కమిటీ కొలువుదీరింది. కలెక్టరేట్​లోని(Kamareddy) మీటింగ్ హాల్​లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) హాజరై కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు.

Kamareddy Red Cross | కొన్నేళ్లుగా అద్భుతమైన సేవలు

కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రెడ్​క్రాస్ సొసైటీ జిల్లాలో అద్భుతమైన సేవలు అందిస్తోందని కొనియాడారు. నూతన కమిటీ కృషితో కామారెడ్డి జిల్లా బ్రాంచ్ రాష్ట్రంలోనే అత్యధిక మెంబర్ షిప్ నమోదు చేసి రెండో స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్​బ్యాంక్ ఏర్పాటుకు విశేష కృషి చేయాలని నూతన కమిటీకి కలెక్టర్ సూచించారు. బ్లడ్​బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంలో జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కీలక హామీ ఇచ్చారు.

Kamareddy Red Cross | ప్రజారోగ్యానికి సంబంధించి..

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్​ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నషా ముక్త్ భారత్, టీబీ ముక్త్ భారత్ వంటి కార్యక్రమాల్లో రెడ్​క్రాస్ సొసైటీ ముందుండి పనిచేయాలన్నారు. బ్లడ్​బ్యాంక్ ఏర్పాటు చేస్తే తనవంతు సహాయంగా రూ.5లక్షలు ఇస్తానని నూతన చైర్మన్ సంజీవరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ కామారెడ్డి బ్రాంచ్ నూతన ఛైర్మన్ డాక్టర్ సంజీవరెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్​ డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్​గా దస్తిరామ్, ట్రెజరర్​గా రమేష్ రెడ్డి, మాజీ ఛైర్మన్​ రాజన్నతో పాటు డిస్ట్రిక్ట్ ఎంసీ మెంబర్స్​గా నాగరాజు గౌడ్, కృష్ణ, గోవర్ధన్, సదాశివరెడ్డి, శ్రీధర్ జోషి, శ్రీకాంత్, దత్తాత్రి, కిరణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లేబర్ ఆఫీసర్ శశికుమార్, ఎలక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ రెడ్డి, డీఈఓ మల్లికార్జున్, డీఎంహెచ్​వో వెంకట్​తో పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు, రెడ్​క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లోకి Rapido Ownly.. ఫుడ్ ధరలు తగ్గుతాయా? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *