అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Worms in KitKat Chocolate | కిట్‌క్యాట్ చాక్లెట్లో పురుగులు వచ్చాయి. దీంతో ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ మేరకు కంపెనీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.
కూకట్‌పల్లిలోని లూలూ మాల్ (Lulu Mall)లో పండుగ షాపింగ్ సందర్భంగా ఓ వ్యక్తి కిట్‌క్యాట్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. పిల్లల కోసం దానిని కొన్న అతను.. ఇంటికి వెళ్లి తెరిచి చూడగా.. పురుగులు కనిపించాయి. అందులో పురుగులు కదులుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేసినట్లు కస్టమర్ తెలిపారు.
Worms in KitKat Chocolate | చర్యలు తీసుకోవాలి
పిల్లలతో పాటు పెద్దలు ఎంతో మంది చాక్లెట్లను ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలాంటి చాక్లెట్లలో పురుగులు రావడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు గమనించకుండా అలాగే తింటే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మాల్, సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై కిట్‌క్యాట్ కంపెనీ, లూలూ మాల్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు.
దీనిని కూడా చదవండి : Stock Market Closing Today | లాభాలతో ముగిసిన సూచీలు