Khairatabad Ganesh | వినాయక ఉత్సవాలు.. ఖైరతాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

ఖైరతాబాద్​ గణేశుడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khairatabad Ganesh | హైదరాబాద్​ (Hyderabad)లో గణేశ్​ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా గణనాథులు సోమవారం మండపాల్లో కొలువు దీరనున్నారు. ఖైరతాబాద్​లో భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నారు.

ఖైరతాబాద్ ‘బడా గణేష్’ ఏర్పాటు నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. . ఈ నెల 12 నుంచి 24 వరకు ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి, ఉదయం 11:00 గంటల నుండి అర్ధరాత్రి వరకు అవసరాన్ని బట్టి పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, రద్దీగా ఉండే మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Khairatabad Ganesh | ట్రాఫిక్​ మళ్లింపులు ఇలా..

వి.వి. విగ్రహం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఆ వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. పాత పోలీస్ స్టేషన్ సైఫాబాద్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా బడా గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. వాహనదారులు రాజ్‌దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు టర్న్​ తీసుకోవాలి. ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమాక్స్ థియేటర్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను.. మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. నెక్లెస్ రోటరీ నుండి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు.

Khairatabad Ganesh | అధిక రద్దీ

బడా గణేశుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీఐపీలు సైతం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య, నిరంకారి, ఓల్డ్ పిఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్, మసబ్ ట్యాంక్ వంటి కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అధికంగా ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు.

Khairatabad Ganesh | పార్కింగ్ స్థలాలు

ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల పార్కింగ్ కోసం పోలీసులు ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ (NTR Garden) ద్వారా వచ్చే సందర్శకులు తమ వాహనాలను రేస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్​ థియేటర్​ పక్కన హెచ్​ఎండీఏ పార్కింగ్​, ఐమాక్స్ (I Max)​ థియేటర్​ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాల్లో పార్కింగ్​చేయాలి. ఖైరతాబాద్ జంక్షన్ ద్వారా వచ్చే భక్తులు విశ్వేశ్వరయ్య భవన్‌లో పార్క్ చేయాలి.

దీనిని కూడా చదవండి : Tahsildar Bribery Case | లంచం కేసులో తహశీల్దార్​కు రెండేళ్ల జైలు శిక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.