అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tahsildar Bribery Case | లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)కి దొరికిన ఓ తహశీల్దార్‌కు కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సంతోష్ కుమార్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట మండల తహశీల్దార్‌గా పని చేనసిన అలుగునూరి రోషయ్య 2013 జనవరి 9న లంచం తీసుకుంటూ దొరికాడు. ఓ వ్యక్తి భూమి మ్యుటేషన్, పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయడం కోసం రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అతడిని అప్పుడు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 13 ఏళ్ల తర్వాత తాజాగా ఆ కేసులో నిందితుడైన తహశీల్దార్ రోషయ్యకు కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
Tahsildar Bribery Case | దోషిగా తేలడంతో..
సాక్ష్యాధారాలను విచారించిన కోర్టు తహశీల్దార్ అలుగునూరి రోషయ్యను దోషిగా నిర్ధారించారు. రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా చెల్లించాలని శిక్ష విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించింది.
Tahsildar Bribery Case | విచారణలో జాప్యం
ఏసీబీ కేసుల విచారణలో జాప్యం.. అవినీతి అధికారులకు వరంగా మారుతోంది. చాలా కేసుల్లో నిందితులకు శిక్ష పడటం లేదు. పడ్డా ఏళ్లకు ఏళ్లు విచారణ జరుగుతుండటంతో లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజా కేసులో 13 ఏళ్ల తర్వాత శిక్ష పడటం గమనార్హం. అంతేగాకుండా జరిమానా కూడా తక్కువ మొత్తంలో వేస్తున్నారు. దీంతో నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా.. శిక్షలు ఉండవనే ధీమాతో అధికారులు లంచాలు తీసుకోవడం ఆపడం లేదు.
దీనిని కూడా చదవండి : Nagpur Bank Robbery | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి దోపిడీ