అక్షరటుడే, వెబ్డెస్క్: Jana Sena Joinings Committee | జనసేన పార్టీ ( Jana Sena Party)లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన వారి చేరికలను సమన్వయం చేయడానికి 14 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు.
Jana Sena Joinings Committee | తెలంగాణలో సైతం..

ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేస్తానని పవన్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ఏపీతో పాటు, తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే చేరికల కోసం ప్రత్యేక కమిటీని నియమించింది.
ఇది కూడా చదవండి..: NDA Rajya Sabha Strength | రాజ్యసభలో పెరిగిన ఎన్డీఏ బలం