YS Jagan Speech | ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి : వైఎస్​ జగన్‌

ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్​ అన్నారు. ప్రశ్నించేవారిపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan Speech | ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్​ అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని తెలిపారు.

తమ పాలనలో 99 శాతం హామీలు అమలు చేశామని జగన్​ చెప్పారు. సంక్షేమ క్యాలెండర్ అమలు చేశామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 3 లక్షల మంది గిరిజనులకు పట్టాలు ఇచ్చామన్నారు.

YS Jagan Speech | త్వరలో ముగింపు

YS Jagan Speech

చంద్రబాబు (CM Chandrababu) హయాంలో విధ్వంసకర పాలన నడుస్తోందని జగన్​ విమర్శించారు. దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందన్నారు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలని సూచించారు. బాధితులకు అండగా నిలవాలన్నారు.

ఇది కూడా చదవండి..: Jana Sena Joinings Committee | జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి కమిటీ ఏర్పాటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *