Prakasam District Tragedy | ప్రకాశం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య

ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Prakasam District Tragedy | ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District)లో విషాదం చోటు చేసుకుంది. చీమకుర్తి మండలం అగ్రహారంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి తన ముగ్గురు పిల్లల ఆహారంలో విషం కలిపి ప్రాణాలు తీశాడు. ఆపై తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గ్రామానికి చెందిన సుధాకర్​కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే సుధాకర్​కు, ఆయన భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన సుధాకర్​ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.

Prakasam District Tragedy | పిల్లలను చంపి..

ఈ క్రమంలో సుధాకర్​ తన ముగ్గురు కూతుళ్లు.. గోచిత(13), పూజిత(11), లోకిత శ్రీ ( 8) కి విషం పెట్టాడు. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల తల్లిదండ్రులు తమ పిల్లలను చంపి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి..: YS Jagan Speech | ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి : వైఎస్​ జగన్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *