Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్​డేట్​.. 30న నిధులు విడుదల

రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa Funds | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వానాకాలం సాగు సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో రైతు భరోసాపై చర్చించారు. రైతు భరోసా నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 30న మధిరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆ సభలో సీఎం రేవంత్​రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. అనంతరం అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Rythu Bharosa Funds | తప్పనున్న తిప్పలు

ప్రభుత్వం ఈ నెల 26న రైతు భరోసా (Rythu Bharosa) విడుదల చేస్తుందని మొదట ప్రచారం జరిగింది. అయితే తాజాగా మంత్రివర్గం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 30న నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసాగా మార్చిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.6 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కాంగ్రెస్​ రెండున్నరేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయిలో రైతు భరోసా జమ చేసింది. గత వానాకాలం సీజన్​లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో వేసింది. పోయిన యాసంగి సీజన్​లో రెండు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు వేసింది. ఈ సీజన్​లో సకాలంలో డబ్బులు జమ చేస్తామని చెప్పడంతో రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన తిప్పలు తప్పనున్నాయి.

ఇది కూడా చదవండి..: RTC Fitment 2021 | ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు.. ఫిట్‌మెంట్‌పై మంత్రి పొన్నం క్లారిటీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *