Nagpur Bank Robbery | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి దోపిడీ

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలు బ్యాంకులోకి చొరబడి దోపిడీ చేశాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagpur Bank Robbery | మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్‌పూర్‌లో ఓ దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలు బ్యాంకులోకి చొరబడి దోపిడీ చేశాడు. సిబ్బంది కళ్లలో కారం చల్లి రూ.4 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు.

నాగ్​పూర్​లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో బ్యాంకు ఉద్యోగుల కళ్లలో కారం పొడి చల్లి దోపిడీకి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్‌రాజ్ బోర్కర్‌గా గుర్తించారు. బీఎస్సీ చదివిన అతడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఘటనా స్థలం నుండి రూ. 4 లక్షల నగదుతో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు సమాచారం.

Nagpur Bank Robbery | కస్టమర్​లా వచ్చి..

అతను సాధారణ కస్టమర్‌లా బ్యాంకులోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అనంతరం బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లాడు. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీయగా.. అతడు డబ్బులు తీసుకొని పారిపోయే యత్నం చేశాడు. ఘటన జరిగిన 30 నిమిషాల్లోనే పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకు ఉద్యోగులు అతన్ని వెంబడించగా, పోలీసులు పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి..: Suvendu Adhikari | ఆలయంలో చేపలు తిన్న సీఎం.. ఎందుకో తెలుసా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *