అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Lodge Death | హైదరబాద్ (Hyderabad) నగరంలోని లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో రేణుక అనే 26 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు ఫరూక్ అనే వ్యక్తి ఉన్నాడని, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
రేణుక నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పని చేస్తున్నారు. ఆమెకు ఫరూక్ (34) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. ఈ క్రమంలో జూలై 2వ తేదీ రేణుక, ఫరూక్ లంగర్ హౌస్ వచ్చారు. అక్కడ ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రి రేణుక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫరూక్ పోలీసులకు సమాచారం అందించాడు.
Hyderabad Lodge Death | ఫరూక్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు
రేణుక మరణాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఫరూక్ తమ కూతురిని హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేణుకతోపాటు గదిలో దిగిన ఫరూక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: DSP Bheem Reddy ACB | డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై ఏసీబీ పంజా: భారీగా అక్రమాస్తుల గుర్తింపు