అక్షరటుడే, వెబ్డెస్క్: Russia Drone Attack | ఉక్రెయిన్ (Ukraine ) రాజధాని కీవ్ నగరంపై రష్యా గురువారం రాత్రి డ్రోన్లతో భీకర దాడికి తెగబడింది. ప్రయోగించిన డ్రోన్ల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
రాజధానిపై రాత్రిపూట జరిగిన ఈ దాడులకు తమ బలగాలు ప్రతీకారం తీర్చుకుంటాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు హెచ్చరించారు. 9 అంతస్తుల నివాస భవనంపై దాడి జరిగిందని, ఒక క్షిపణి 64 అపార్ట్‌మెంట్లను ధ్వంసం చేసిందని జెలెన్స్క్కీ పేర్కొన్నారు. రష్యా మరోసారి ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులు, నివాస భవనాలపై దాడి చేసింది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో 27 మంది వరకు మృతి చెందారు.
Russia Drone Attack | 476 డ్రోన్లను కూల్చివేశాం
రష్యా రాత్రికి రాత్రే క్షిపణులు, డ్రోన్లతో తమ దేశంపై దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వైమానిక రక్షణ విభాగాలు 48 క్షిపణులను, 476 డ్రోన్లను కూల్చివేశాయని ప్రకటించింది. అయితే 25 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లు 33 ప్రదేశాలపై పడ్డాయని పేర్కొంది. దాడి జరుగుతుందనే భయంతో 4,500 మంది పిల్లలతో సహా 52,500 మంది ప్రజలు రాత్రంతా భూగర్భ స్టేషన్లలో తలదాచుకున్నారు.
ఇది కూడా చదవండి..: Indonesia Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం: టోబెలో సమీపంలో 6.2 తీవ్రతతో ప్రకంపనలు