అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Putin Praises Modi | రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు ఇరుదేశాలకు సూచించారు. చర్చలతో సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ మేరకు యుద్ధం ఆపడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు.
శాంతియుతమైన, ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి మోదీ (Modi)కి మంచి ఆలోచనలు ఉన్నాయని పుతిన్ అన్నారు. భారత్‌తో తమకు సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ, మోదీ ఈ సంఘర్షణను ముగించే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారని చెప్పారు. శాంతి ప్రయత్నాలు చేస్తున్న మోదీకి ధన్యవాదాలు తెలిపారు.సంఘర్షణను ముగించడంలో ఆసక్తిని కొనసాగిస్తూనే భారత్ తటస్థ వైఖరిని కలిగి ఉందని పేర్కొన్నారు.
Putin Praises Modi | మోదీకి కృతజ్ఞతలు
శాంతియుత మార్గాల ద్వారా, వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని మోదీ కోరుకుంటున్నందుకు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా యుద్ధాన్ని ఆపాలని మోదీ పలుమార్లు పిలుపునిచ్చారు. సంఘర్షణను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన ప్రోత్సహించారు. పరిష్కారం కోసం ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Modi Trump call | ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. వాణిజ్యం, రక్షణ, ఇంధనంపై చర్చలు