అక్షరటుడే, వెబ్‌డెస్క్: YSR Jagan KTR Vijay | రాజకీయాలు, సినిమా రంగాల కలయిక ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాంటిది విభిన్న రాష్ట్రాలకు చెందిన అగ్ర రాజకీయ నేతలు, సినీ గ్లామర్ స్టార్స్ ఒకే వేదికపై, ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే? సరిగ్గా అలాంటి ఓ అరుదైన, కన్నులపండువైన దృశ్యానికి తమిళనాడు రాజధాని చెన్నై వేదికైంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహ వేడుక చెన్నై Chennai లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ రాయల్ వెడ్డింగ్‌కు తెలుగు, తమిళ రాష్ట్రాల నుంచి పలువురు వీఐపీలు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
YSR Jagan KTR Vijay | దిగ్గజాల అరుదైన కలయిక
ఈ శుభకార్యానికి వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి హాజరయ్యారు. అలాగే తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సతీమణితో కలిసి విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు నుంచి తమిళనాడు సీఎం విజయ్.. నటి త్రిషతో కలిసి ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
YSR Jagan KTR Vijay | నెట్టింట సంచలనం సృష్టిస్తున్న ‘స్టార్ ఫ్రేమ్’
వివాహ వేదికపై నూతన వధూవరులతో కలిసి వైఎస్ జగన్ దంపతులు, కేటీఆర్ దంపతులు, అలాగే విజయ్ – త్రిష కలిసి దిగిన గ్రూప్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
రాజకీయ వైరుధ్యాలు, రాష్ట్ర సరిహద్దులను పక్కనపెట్టి అగ్ర నేతలు, నటులు ఎంతో ఆత్మీయంగా ముచ్చటించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. పొలిటికల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌కు చెందిన ఈ ‘పవర్ ఫుల్ ఫ్రేమ్’ పిక్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.