Nov 06 Horoscope | హస్తా నక్షత్రం, త్రిపుష్కర యోగం.. కర్కాటకం సహా ఈ రాశుల వారింట లక్ష్మీదేవి కటాక్షం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 06 Horoscope |జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ చంద్రుడు సింహ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉండనుంది. పవిత్రమైన ధన త్రయోదశి పర్వదినాన విష్కంభ, ప్రీతి, త్రిపుష్కర యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి.

లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ శుభ (నవంబరు 06, శుక్రవారం) ఘడియల్లో కర్కాటకంతో పాటు కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు చేకూరనుండగా, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

Nov 06 Horoscope |రాశుల వారీగా..

మేష రాశి: Nov 06 Horoscope | చంద్రుడు, శుక్రుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నారు. ధన త్రయోదశి పవిత్ర సమయం కావడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం శ్రేయస్కరం.పరిహారం. ఇవాళ ‘కనకధార స్తోత్రం’ పఠించండి.

వృషభ రాశి: Nov 06 Horoscope | వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుని అనుగ్రహంతో ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ఆభరణాలు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి సమయం చాలా అనుకూలంగా ఉంది. శుభ యోగాల వల్ల పాత బకాయిలు తిరిగి చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ సమయస్ఫూర్తితో రాబడిని పెంచుకుంటారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

మిథున రాశి: Nov 06 Horoscope | నాలుగో స్థానంలో చంద్ర-శుక్రుల సంచారం, ఐదో స్థానంలో బుధుడి సంచారం వల్ల ఆర్థిక ప్రయత్నాల్లో అద్భుత విజయాలు లభిస్తాయి. వ్యాపారస్తులు పురోగతి సాధిస్తారు, ఉద్యోగులకు పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఆనందం నిండుతుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి: Nov 06 Horoscope | లక్ష్మీదేవి , చంద్రుని ఆశీస్సులతో కర్కాటక రాశి వారికి కలసివస్తుంది. హస్తా నక్షత్రం, శుభ యోగాల వల్ల వ్యాపారులకు భారీ లాభాలు దక్కుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ సమాచారం అందుతుంది. ధనత్రయోదశి రోజు రాగి పాత్ర కొనుగోలు చేయడం లేదా ధన లావాదేవీలు చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.

సింహ రాశి: Nov 06 Horoscope | సూర్యదేవుడు, లక్ష్మీదేవి కటాక్షంతో మీకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ లేదా కొత్త పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో హోదా, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల సందడి మొదలవుతుంది.ప

కన్యా రాశి: Nov 06 Horoscope | శుక్ర-చంద్రుల కలయిక వల్ల ఏర్పడే ‘కళానిధి యోగం మీకు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావడంతో పాటు అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.

తులా రాశి: Nov 06 Horoscope | శుభ యోగాల ప్రభావంతో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అయితే అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకుని పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి: చంద్ర, శుక్రుల సంచారం వల్ల వ్యాపారులకు మంచి ఆదాయం సమకూరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆఫీసులో వాతావరణం బాగుంటుంది. తోబుట్టువులతో సంతోషంగా సమయం గడుపుతారు, కుటుంబంలో ఒకరికొకరు తోడ్పాటు అందిస్తారు.పరిహారం: లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించండి.

ధనస్సు రాశి: గురు గ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనస్సు మీకు ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరిగి పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అన్ని రంగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మకర రాశి: తొమ్మిదో స్థానంలో చంద్ర-శుక్రుల సంచారం వలన మీకు లాభదాయకంగా ఉంటుంది. రాబడి పెరిగి ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇంట్లో ప్రశాంతత నిండుతుంది.

కుంభ రాశి: అష్టమ స్థానంలో చంద్ర సంచారం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో కొంత ఒత్తిడి పెరిగినప్పటికీ, సహోద్యోగుల మద్దతుతో అధిగమిస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.

మీన రాశి: ఇవాళ మీకు అనుకూల, ప్రతికూలతలు సమానంగా ఉంటాయి. శుక్ర-చంద్రుల కలయిక వల్ల పనుల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కోరుకున్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. అయితే సాయంత్రం తర్వాత ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *