అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nov 06 Market Analysis | యూఎస్ కాంగ్రెస్‌పై డెమోక్రాట్లు(Democrats) నియంత్రణ సాధించిన తర్వాత ఏఐ నియంత్రణలు కఠినతరం అవుతాయనే భయాలతో చిప్‌మేకర్ల షేర్లు పడిపోయాయి.
సంప్రదాయ పరిశ్రమలతోపాటు డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనుబంధ వ్యాపారాలకు చెందిన స్టాక్స్ భారీ సెలాఫ్‌కు గురవడంతో వాల్‌స్ట్రీట్ భారీగా నష్టపోయింది. దీని ప్రభావం శుక్రవారం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది.
Nov 06 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
వాల్ స్ట్రీట్ బెంచ్‌మార్క్ సూచీలలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. సంప్రదాయ పరిశ్రమలు, డేటా సెంటర్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుబంధ వ్యాపారాలకు చెందిన స్టాక్స్ భారీ సెలాఫ్‌కు గురయ్యాయి.
దీంతో 2025 ఏప్రిల్ తర్వాత నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 లు అత్యంత దారుణమైన ట్రేడింగ్ సెషన్‌ను నమోదు చేశాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 5.52 శాతం, ఎస్ అండ్ పీ 4.36 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.57 శాతం నష్టంతో ఉంది.
Nov 06 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.43 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.43 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.33 శాతం లాభంతో ముగిశాయి.
Nov 06 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 6.06 శాతం జపాన్‌కు చెందిన నిక్కీ 5.41 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.39 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 2.20 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.09 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.75 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.51 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు సైతం గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులు ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 14,974 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు చాలాకాలం తర్వాత వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 10,444 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలపడి 94.47 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.68 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.86 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.15 నుంచి 1.29 కు పెరిగింది.
- విక్స్ 2.58 శాతం పెరిగి 15.58 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 99.76 డాలర్ల వద్ద ఉంది.