Stock Market Losses | నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల బాటలో కొనసాగుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడడం లేదు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం ఒడిదుడుకులకు లోనవుతోంది. ఎఫఎంసీజీ, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Stock Market Losses | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 104 పాయింట్ల గ్యాప్ అప్‌తో ప్రారంభమై మరో 118 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 519 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 20 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 160 పాయింట్లు తగ్గింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో 77,225 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 24,148 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కొటక్ బ్యాంక్ 2.15 శాతం, టెక్ మహీంద్రా 1.07 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.86 శాతం, బీఈఎల్ 0.66 శాతం, సన్‌ఫార్మా 0.63 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.69 శాతం, ఎన్టీపీసీ 1.58 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.27 శాతం, ఎం అండ్ ఎం 1.06 శాతం, హెచ్యూఎల్ 1.04 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Aug 27 Gold Prices | పీక్​లోనే బంగారం, వెండి ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *