Forest Martyrs Day | నగరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Forest Martyrs Day | జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో (Nizamabad Forest Department) జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో (Nizamabad) అధికారులు, సిబ్బంది బైక్​ ర్యాలీ నిర్వహించారు.

Forest Martyrs Day | వారి త్యాగాలను మరువలేం..

అమరవీరుల స్మారక స్థూపం వద్ద జిల్లా అటవీ అధికారి (DFO) పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం సిబ్బంది రెండు నిమిషాల మౌనం పాటించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా అటవీశాఖాధికారి మాట్లాడుతూ.. 1730 సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీ గ్రామంలో పవిత్రమైన చెట్లను నరకకుండా కాపాడేందుకు అమృతదేవి బిష్ణోయ్ నాయకత్వంలో 363 మంది బిష్ణోయ్ తెగ ప్రజలు తమ ప్రాణాలను బలిదానం చేశారు.

వారి అమరత్వానికి గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 11ను ‘జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం’గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. అటవీ సంపద దోపిడీని అడ్డుకోవడం, కలప స్మగ్లర్లు, వేటగాళ్లను నిరోధించడం మరియు దావానలాల (Forest Fires) నుండి అడవులను కాపాడటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న ఫ్రంట్‌లైన్ సిబ్బంది సేవలు అజరామరమైనవని ప్రశంసించారు.

Forest Martyrs Day | అండగా ఉంటాం

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని, వారి సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని డీఎఫ్​వో స్పష్టం చేశారు. ర్యాలీ అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (FROs), సెక్షన్ ఆఫీసర్లు (FSOs), బీట్ ఆఫీసర్లు (FBOs) సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తాతా మధు మాట్లాడింది తప్పే..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *