Quality Power Supply | వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలి : బీకేఎస్‌ ప్రతినిధుల డిమాండ్​

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Quality Power Supply | రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి (BKS Telangana) డిమాండ్‌ చేశారు. శుక్రవారం బీకేఎస్‌ ప్రతినిధులు హైదరాబాద్‌లో (Hyderabad) టీజీఎస్పీడీసీఎల్‌(TGSPDCL) సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ను కలిశారు. విద్యుత్‌ సమస్యలపై వినతిపత్రం అందించారు.

Quality Power Supply |పంట దెబ్బతినే ప్రమాదం..

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఎక్కువయ్యాయని, కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పంట చేతికి వచ్చే కీలక సమయంలో సరైన విద్యుత్ సరఫరా లేకపోతే వేలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అప్రకటిత కోతలను నివారించి, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని కోరారు.

Quality Power Supply |డిమాండ్‌ పెరగడం వల్లే..

టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ బీకేఎస్‌ నేతలతో అరగంటకుపైగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. మూడు, నాలుగు రోజులుగా సాంకేతిక కారణాలు, డిమాండ్ పెరగడం వంటి కారణాలతో విద్యుత్‌ సరఫరాలో సమస్య తలెత్తిందని సీఎండీ పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి సంస్థ చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో బీకేఎస్‌ రాష్ట్ర నేతలు సాదినేని రవీందర్‌, సుబ్బారెడ్డి, వినోద్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: చరణ్ ఎలిమినేట్ కారణం ఇదే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *